ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా..? అధికంగా తింటే అనర్ధాలు తప్పవు జాగ్రత్త!

ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా..? అధికంగా తింటే అనర్ధాలు తప్పవు జాగ్రత్త!


ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా..? అధికంగా తింటే అనర్ధాలు తప్పవు జాగ్రత్త!
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

ప్రస్తుత రోజుల్లో ఓట్స్ అలవాటు బాగా పెరిగింది. చాలామంది ప్రతిరోజూ ఓట్స్ తింటూ ఉంటారు. ఓట్స్ తో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. భావిస్తారు. ఓట్స్ లో విటమిన్ బి2, విటమిన్ సి, పీచు పదార్థం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ చాలా మంచి పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఓట్స్‌ను తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. కేవలం అల్పాహారంగానే కాకుండా వివిధ రకాలుగా ఓట్స్ తినవచ్చు. అయితే, రోజూ ఓట్స్ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ఎలాంటి ఆరోగ్యకర ఆహారం అయినా సరే.. అతిగా తినటం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. అలాగే, ఓట్స్ అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓట్స్ అధికంగా తిన్న వారిలో కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఓట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలు రావొచ్చు అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాల్షియం, ఇనుము, జింక్ వంటి కొన్ని ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.

ఓట్స్ పోషకమైనవి అయినప్పటికీ కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది. అల్పాహారం కోసం ప్రతిరోజూ ఓట్స్‌పై ఆధారపడటం వల్ల మీకు అవసరమైన అన్ని పోషకాలు లభించకపోవచ్చు. ఓట్స్ ప్రతిరోజూ తీసుకోవటం వల్ల కొందరిలో అజీర్తి, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం కోసం ప్రతిరోజూ ఓట్స్ తినడం మంచిది కాకపోవచ్చు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వాడకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *