ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, వంటి వ్యాధుల నివారణలో కూడా పొట్టు మినపపప్పును వాడుతుంటారని అంటున్నారని నిపుణులు చెబుతున్నారు.. పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ పప్పుతో ఆరోగ్యం మాత్రమే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మినరల్స్ , విటమిన్స్, పుష్కలంగా ఉంటాయి. ఇవి సన్ టాన్స్ ను తొలగిస్తాయి. ఆరోగ్యవంతమైన, జుట్టుకు మినపప్పులో ఉండే పోషకాలు ఎంతగానో మేలు చేస్తాయని అంటున్నారు.
ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటివి మినపప్పులో ఉన్నాయి. ఈ పప్పు గట్ హెల్త్ ను మెరుగుపరిచి, శరీరంలోని ఐరన్ లెవల్స్ ను పెంచేందుకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా,దృఢంగా ఉంచుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
బరువు తగ్గించడంలో మినప పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి. కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది. పేగుల్లో వ్యర్థాలను సులభంగా బయటకు పంపే విధంగా ఇది సహాయపడుతుంది.
డయాబెటిస్ బాధితులు మినప పప్పును డైలీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందులో పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు.