తాజాగా ఓ ఇంటి పెరట్లో భారీ కొండచిలువ ఆ ఇంట్లోని వారిని పరుగులు పెట్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి బయట పనిచేసుకుంటున్నాడు. ఇంతలో పెరట్లోని మొక్కల మధ్య నుంచి ఏదో వినతమైన కదలికలు శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతను భయంతో వణికిపోయాడు. తేరుకున్న తర్వాత అతను కుటుంబ సభ్యులను అలర్ట్ చేశాడు. పెరట్లో వర్షాల కారణంగా ఏపుగా పెరిగిపోయిన కలుపు మొక్కల మధ్య భారీ కొండచిలువను చూసి వారంతా భయంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు స్థానిక స్నేక్ కాచర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ కాచర్ మోహన్ కొండచిలువను బంధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొండచిలువ మోహన్ పై దాడికి యత్నించింది. కానీ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ మోహన్ దానిని బంధించాడు. అనంతరం సమీప నల్లమల అడవుల్లో సురక్షితంగా కొండచిలువను వదిలిపెట్టాడు. దీంతో విజయ్ కుటుంబం స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
వామ్మో ఇవేం పాములురో బాబు.. కుప్పలు కుప్పలుగా వీడియో
పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో
అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
కొండచిలువలను వేటాడటంలో క్వీన్.. పదిరోజుల్లో ఏకంగా..