పులస పులుసు సీక్రెట్.. ఈ మసాలా కలిపితే చాలు..! ఒకసారి తింటే మర్చిపోలేరు.. వానాకాలంలో పర్ఫెక్ట్ రెసిపీ..!

పులస పులుసు సీక్రెట్.. ఈ మసాలా కలిపితే చాలు..! ఒకసారి తింటే మర్చిపోలేరు.. వానాకాలంలో పర్ఫెక్ట్ రెసిపీ..!


వానకాలం వచ్చిందంటే చాలు.. చేపల ఘుమఘుమలు ఊరంతా నిండిపోతాయి. అందులోనూ పులస చేపలు దొరికితే ఇక విందు మొదలైనట్టే. రుచికి ప్రాణం ఇచ్చేవాళ్లు ఈ వంటకాన్ని అస్సలు పక్కన పెట్టలేరు. ఈ పులస పులుసు మాంసాహార ప్రియులకు చాలా ఇష్టం. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు

  • పులస చేపలు – 1 కిలో
  • ఉల్లిపాయలు – 3 (మిక్సీలో పేస్టుగా చేసుకోవాలి)
  • పచ్చిమిర్చి – 10 (నిలువుగా కట్ చేసుకోవాలి)
  • బెండకాయలు – 6 (రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • చింతపండు – 50 గ్రాములు (నీటిలో నానబెట్టి చిక్కటి రసం తీయాలి)
  • అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టేబుల్ స్పూన్లు (తాజాగా నూరినది అయితే ఇంకా బెస్ట్)
  • కారం – 4 టేబుల్ స్పూన్లు
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • పసుపు – 1 టీ స్పూన్
  • ఉప్పు – రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు – 1 గుప్పెడు
  • నూనె – తగినంత (రుచికోసం కొంచెం ఎక్కువ వాడొచ్చు)

తయారీ విధానం

పులస ముక్కలను పసుపు, ఉప్పుతో బాగా రుద్ది శుభ్రంగా కడగాలి. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ నీళ్లలో కడగొద్దు జాగ్రత్త. ఉల్లిపాయలను మిక్సీలో వేసి మెత్తగా ముద్దగా చేయాలి. చింతపండును ముందుగానే నానబెట్టి దాని నుంచి చిక్కటి రసం తీయాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేయాలి, బెండకాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని రెడీగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముద్దను వేయించి గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపాలి. ఈ టైంలో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నింటినీ వేసి బాగా వేయించాలి. మంచి వాసన రాగానే పచ్చిమిర్చి ముక్కలు, చేప ముక్కలు జోడించాలి. ఆ తర్వాత ముందుగా తీసిన చింతపండు రసాన్ని పోసి ఆపై అర లీటరు నీళ్లు కలిపి మూత పెట్టాలి. మంట తక్కువగా పెట్టి మరిగించాలి. మధ్యలో ఒకసారి పాత్రను రెండు వైపులా పట్టుకొని తేలికగా కదిలించాలి.. గరిటతో కలిపితే చేపలు విరిగిపోతాయి జాగ్రత్త.

ఇప్పుడు బెండకాయ ముక్కలు, కొత్తిమీర తురుము వేసి మళ్లీ మూతపెట్టి మరికొంతసేపు మరిగించాలి. అవసరమైతే కారం, ఉప్పు సరిచూసుకొని బాగానే కలపాలి. పులుసు చిక్కగా మారిన తర్వాత స్టవ్ పై నుంచి దించేయాలి. ఈ వంటకాన్ని మట్టికుండలో మరిగిస్తే రుచి మరింత అదిరిపోతుంది. తక్కువ మంట మీద నెమ్మదిగా వండితే మసాలా పూర్తిగా చేపల్లో ఇంకిపోయి, వాసనలోనే ఆకలి పుట్టించేలా ఉంటుంది. ఇలా చేసి చూడండి.. ఈ పులస పులుసు ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *