పిల్లోడిని కార్లో పడుకోపెట్టి పీఎస్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చేసరికి కనిపించని బాలుడు.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

పిల్లోడిని కార్లో పడుకోపెట్టి పీఎస్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చేసరికి కనిపించని బాలుడు.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే?


పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఈదరాడ కామేశ్వరరావు తన చిన్న చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు జూలై 25 తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు తన తల్లి, ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి పెంటపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రోడ్డులో కారు పార్క్ చేసి, అందులో 4 సంవత్సరాల మేనల్లుడు నిద్ర పోతూ ఉండడంతో కారులోనే ఉంచి లాక్ చేసి, మిగిలిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ లోపలికి వెళ్లారు. ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి కారు వద్దకు వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. బాలుడి కోసం ఆ ప్రాంతం అంతా వెతికారు. బాలుడి ఆచూకీ లేకపోవడంతో వెంటనే వారు తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి బాలుడు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పెంటపాడు పోలీసులు బాలుడి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తెల్లవారుజాము చీకటి,‌ ఏమీ‌ తెలియని పసివాడి అదృశ్యం కావడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో వారి సిబ్బందిని ప్రత్యెక బృందాలుగా ఏర్పాటు చేసారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విస్తృతంగా గాలింపు చేపట్టారు. చీకటిలో రోడ్డుపై ఒంటరిగా ఉన్న బాలుడిని ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై తీసుకుని వెళ్ళినట్టు గుర్తించారు.

బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తి వేసుకున్న షార్ట్ ఆధారంగా అతనిడి గుర్తించిన పోలీసులు.. అతని ఇంటికి వెళ్ళారు. ఆసమయంలో ఆ బాలుడికి పాలు పట్టించి ఇంట్లో నిద్రపూర్చాడు ఆ వ్యక్తి. అక్కడికి చేరుకున్న పోలీసులు కేవలం మూడు గంటల స్వల్ప వ్యవధిలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిస్సింగ్ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించేన పెంటపాడు స్టేషన్ పోలీసులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *