పనిమనిషి చేసిన పనికి అంతా షాక్.. సీసీ కెమెరా చూసి నోర్రెళ్లబెట్టిన యాజమాని!

పనిమనిషి చేసిన పనికి అంతా షాక్.. సీసీ కెమెరా చూసి నోర్రెళ్లబెట్టిన యాజమాని!


ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దిగ్భ్రాంతికరమైన, కలతపెట్టే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. బిజ్నోర్‌లోని నాగినా పట్టణంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మహిళ చేసిన పని ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది. ఆ ఇంటి వంటగదిలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో అసహ్యకరమైన ఘటన రికార్డ్ అయ్యింది. సిసిటివిలో రికార్డైన వీడియోలో ఇంటి పని చేయడానికి వచ్చిన మహిళ మొదట ఒక గ్లాసును తీసుకొని అందులో మూత్ర విసర్జన చేసింది. ఆ తరువాత అదే గ్లాసు మూత్రం సింక్‌లో ఉంచిన పాత్రలపై పోయడం కనిపిస్తుంది.

సీసీటీవీలో రికార్డైన ఇంటి పనిమనిషి చర్యతో ఆ కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. పరువు నష్టం జరుగుతుందనే భయంతో తన పేరును వెల్లడించవద్దని ఇంటి యజమాని నాగినా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అసహ్యకరమైన చర్య ద్వారా నమ్మకాన్ని పోగొట్టిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్థానిక పోలీసులు శాంతికి భంగం కలిగించే సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి, ఆమెను SDM నాగినా ముందు హాజరుపరిచారు.

గత పదేళ్లుగా తమ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి చేసిన ఈ అసహ్యకరమైన చర్యతో ఆ వ్యాపారవేత్త, అతని కుటుంబం తీవ్రంగా బాధపడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ కుటుంబం భయంతో వణికిపోతుంది. పనిమనిషి.. తన భర్తను లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో ఇరికించవచ్చని భయపడుతున్నామని వ్యాపారవేత్త భార్య చెప్పింది. ఆమె పదేళ్లుగా ఇంటి పనులన్నీ చేస్తోంది. కానీ ఆమె మా నమ్మకాన్ని చంపేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయం సున్నితమైనది కావడంతో, పరువు పోతుందనే భయాన్ని వ్యక్తం చేసింది వ్యాపారవేత్త కుటుంబం. తన పేరు, చిరునామాను గోప్యంగా ఉంచుతూ చర్య తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకే ఆ మహిళపై కేసు నమోదు చేశామని నాగినా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ తోమర్ తెలిపారు. పోలీసుల ముందు ఆ మహిళ తన తప్పును అంగీకరించింది. గతంలో కూడా ఇలాంటి చర్యలు చేశానని ఒప్పుకుంది.

పనిమనిషి పది సంవత్సరాలుగా పనిచేస్తోందని, గత ఐదు-ఆరు నెలలుగా ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది. అందుకే వంటగదిలో సీసీటీవీ ఏర్పాటు చేశామని కుటుంబసభ్యులు చెప్పారు. దీని తర్వాత, రెండు రోజుల్లోనే ఆమె కార్యకలాపాలు స్పష్టంగా కనిపించాయి. పూజ చేసిన తర్వాత వచ్చి పిల్లలతో కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ చూడటంతో విషయం బయటపడింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే భయపడుతున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *