టాలీవుడ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాని ఒకరు. ఈయన వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్లో ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు ప్రొడ్యూసర్గా మూవీస్ తెరకెక్కిస్తు వరసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. అయితే ఈ హీరో సినిమాలో అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ చూస్తారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మూడు సార్లు నాని సినిమాను రిజక్ట్ చేసిందంట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?
నాని అష్ట చమ్మ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా, అష్ట చమ్మ సినిమాలో నాని నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి. దీంతో పక్కింటి కుర్రాడు లాంటి పలు సినిమాలు చేశారు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సమంత, నాని కాంబినేషన్లో ఈగ మూవీ వచ్చింది. ఈ మూవీతో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని.
దీని తర్వాత వరసగా సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్స్ అందుకుంటూ..దూసుకెళ్తున్నాడు. అయితే కెరీర్ మొదట్లో నాని చాలా సమస్యలు ఎదుర్కొన్నాడంట. మూవీస్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యేవంట. ముఖ్యంగా కొన్ని సార్లు హీరోయిన్స్ విషయంలో కూడా నాని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడంట.
ఓ నటి నానితో నటించడానికి మూడు సార్లు అవకాశం వచ్చినా దానిని రిజక్ట్ చేసిందంట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనే కదా మీ డౌట్. నేషనల్ క్రష్ రష్మిక. ఈ అమ్మడు ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత నాని సినిమాలో ఛాన్స్ వచ్చిందంట రష్మికకు కానీ ఏవో కారణాలు చెప్పి నాని సినిమాను రష్మిక రిజక్ట్ చేసిందంట. మొదటి సారే కదా అని తర్వాత రెండు సార్లు రష్మికను సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.