నిద్రను అస్సలు లైట్ తీసుకోకండి.. లైఫ్ టైమ్ తగ్గే ప్రమాదం ఉంది.. జాగ్రత్త..!

నిద్రను అస్సలు లైట్ తీసుకోకండి.. లైఫ్ టైమ్ తగ్గే ప్రమాదం ఉంది.. జాగ్రత్త..!


నిద్రను అస్సలు లైట్ తీసుకోకండి.. లైఫ్ టైమ్ తగ్గే ప్రమాదం ఉంది.. జాగ్రత్త..!
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి ఒక కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. వర్క్ టెన్షన్లు, మారిన లైఫ్ స్టైల్, టైమ్‌ కి తినకపోవడం, మొబైల్ వాడకం లాంటి రీజన్స్‌ తో చాలా మందికి సరిపడా నిద్ర ఉండట్లేదు. ఇది జస్ట్ అలసటకే కాదు.. మన ఆయుష్షుపై కూడా ఎఫెక్ట్ చూపుతుందని రీసెర్చులు చెబుతున్నాయి.

ప్రాణాలకే డేంజర్

మన బాడీ ప్రాపర్ గా వర్క్ చేయాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. కానీ కొందరు కేవలం 5 గంటలే పడుకుంటున్నారు. ఇది మెల్లిమెల్లిగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువ కాలం నిద్ర లేకపోతే గుండె జబ్బులు, షుగర్, బీపీ, బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. లాంగ్ టర్మ్‌ లో చూస్తే ఇది లైఫ్ స్పాన్‌ ని తగ్గించడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.

హెల్త్ ప్రాబ్లమ్స్

సరిపడా నిద్ర లేనివాళ్లు ఎక్కువగా హై బీపీ, గుండె వేగం పెరగడం, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ లాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎక్కువగా తినేసి చివరికి లావు అవుతారు. ఇది మళ్లీ వేరే జబ్బులకు దారి తీస్తుంది.

మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్

నిద్ర సరిపోకపోతే నిర్ణయం తీసుకునే కెపాసిటీ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతాయి. దీని వల్ల పర్సనల్ లైఫ్‌ లో, జాబ్‌ లో తప్పులు జరగవచ్చు. అంతేకాదు ఎక్కువ కాలం నిద్రలేమి మెదడు బలహీనత, మానసిక ఆందోళనలకు దారి తీస్తుంది.

క్యాన్సర్ ముప్పు కూడా..?

రీసెర్చ్‌ ల ప్రకారం.. నిద్ర సరిపోకపోతే రోగనిరోధక వ్యవస్థ వీక్ అవుతుంది. ఇది బాడీలో హానికరం కణాల గ్రోత్‌ కు హెల్ప్ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని క్యాన్సర్లకు ఇది సపోర్ట్ చేయగలదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (American College of Cardiology) చేసిన పరిశోధనల ప్రకారం.. నిద్రపై మంచి నియంత్రణ ఉన్నవారికి ఎలాంటి మరణ ప్రమాదం అయినా 30 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 21 శాతం తక్కువగా ఉంటాయని తేలింది. అదే సమయంలో ఇతర అధ్యయనాలు ప్రకారం.. రోజుకు ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి మరణ శాతం 15 శాతం వరకు పెరుగుతుందని కనుగొన్నారు. కాబట్టి దీర్ఘకాల ఆరోగ్యానికి సరిపడా నిద్ర అత్యవసరం.

మంచి నిద్రకు టిప్స్

నిద్ర సమయాన్ని సెట్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్. ప్రతిరోజు ఒకే టైమ్‌ కి పడుకోవడం, లేవడం వల్ల శరీర అంతర్గత గడియారం బాగా వర్క్ చేస్తుంది. పడుకోబోయే ముందు మొబైల్, టీవీ స్క్రీన్లను దూరంగా పెట్టేయండి. కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటివి రాత్రిపూట తీసుకోవద్దు. పడుకునే రూమ్ క్లీన్‌గా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.

నిద్రను అస్సలు లైట్ తీసుకోవద్దు. దీని ఎఫెక్ట్ మీ హెల్త్‌పైనే కాదు.. మీ లైఫ్ టైమ్‌పై కూడా ఉంటుంది. నిద్రను నెగ్లెక్ట్ చేయడం అంటే జీవితాన్ని తగ్గించుకోవడం లాంటిదే. హెల్తీగా జీవించాలంటే ప్రతిరోజూ సరిపడా నిద్ర కంపల్సరీ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *