దాంతో పాటే.. శ్రీలీల విసిరే సరదా పంచులకు.. ఫన్నీ బ్లాక్ మెయిల్ మాటలకు షాకయ్యాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే..! రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో జగపతిబాబు శ్రీలీల కౌంటర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. ‘మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం.. నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు’ అని జగపతి బాబు అనగానే, ‘మీరు నన్ను పొగిడారా లేక తిట్టారా?’ అంటూ శ్రీలీల షాకింగ్ ఎక్స్ప్రెషన్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు జగపతిబాబు ఆమె లుక్స్ గురించి ఒక టాపిక్ చెబుతానంటూ చెప్పగానే.. ఒక్క సారిగా బ్లాక్ మెయిల్ మోడ్‌లోకి వెళ్లింది శ్రీలీల. ‘ఆ టాపిక్ తెరపైకి వస్తే.. నేను మీ మేటర్ బయట పెడతా’ అంటూ జగపతికే స్వీట్ వార్నింగ్ ఇచ్చింది శ్రీలీల. దీంతో జగపతి బాబు ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత స్మైల్‌తో సర్దేశాడు. అయితే ప్రోమోలో ఈ బిట్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫుల్ ఎపిసోడ్ పై అంచనాలను పెంచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!
మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..
మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ