దేశమంతా నాగుల పంచమి… అక్కడ మాత్రం తేళ్ల పంచమి..! అదేంటో చూస్తే అవాక్కే..

దేశమంతా నాగుల పంచమి… అక్కడ మాత్రం తేళ్ల పంచమి..! అదేంటో చూస్తే అవాక్కే..


తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులు నాగుల పంచమి సందర్భంగా నాగు పాములకు పూజలు చేస్తే… ఇక్కడ మాత్రం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు. అలాగే కొండపై తేళ్లకు పూజ చేస్తు, తేళ్లను ఇలవేల్పుగా కొలుస్తున్న విచిత్రమైన సంప్రదాయం కొనసాగిస్తున్నారు భక్తులు. అసలే తేళ్ళు తోకలో విషం నింపుకుంటాయి… కరిస్తే అంతే సంగతులు అని అందరూ అనుకుంటారు కానీ అలా జరగదు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ సంప్రదాయ వేడుకల్లో ఏనాడు ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్ళు ఏమి చేయవు. ఈ రోజు అవి కరిచిన అమ్మ వారి సింధూరం అంటిస్తే తగ్గుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇదే ఇక్కడి కొండమేశ్వరీ అమ్మవారి మహిమ అని భక్తులు చెబుతున్నారు.

మొదట అమ్మవారికి పూజలు:

అయితే ఇక్కడికి వచ్చే భక్తులు మొదట కొండమేశ్వరీ అమ్మవారికి పూజల చేస్తారు. అనంతరం గుట్టపై ఉన్న చిన్న చిన్న బండ రాళ్ళ వైపు పరుగులు పెడతారు. ఇక ఇక్కడి విశేషం ఏంటంటే ఏ రాయి తీసిన ఏదో ఒక తేళ్లు దర్శనం ఇస్తుంది. అయితే వాటితో ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఆటలు ఆడుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తేళ్ల ను తమ శరీరం పై ఎక్కించుకుంటారు. వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ తేళ్ల పంచమికి ఒక్క కర్ణాటక నుంచే కాకుండా, తెలంగాణ, మహారాష్ట్ర ల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొంతమంది అమ్మవారిని దర్శించుకుని తేళ్ళతో సరదాగా గడిపితే… మరికొందరు కేవలం ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *