దీన స్థితిలో నటి పాకీజా.. ఆదుకోవాలని పవన్, బాబుకు విన్నపం

దీన స్థితిలో నటి పాకీజా.. ఆదుకోవాలని పవన్, బాబుకు విన్నపం


ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. పాకీజా పేరుతో సినీప్రియులకు దగ్గరైన ఆమె.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో జనాల ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడియ ప్రతినిధులు పలకరించగా.. తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వాసుగి. తమిళనాడులో తనకు ఎవరూ సాయం చేయడం లేదని.. అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉందన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని..కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని.. తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనను ఆదుకున్నారని.. ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన గోడు వినిపించుకోవాలని ఉందని.. తనుక పింఛన్ సౌకర్యం కల్పిస్తే..వారి పేరు చెప్పుకుని బతుకుతానని ఎమోషనల్ అయ్యారు ఈమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇవే.. నా లైఫ్‌లో హ్యాపీ‌డేస్‌.. పెళ్లి తర్వాత అఖిల్ మొదటి పోస్ట్‌!

రుద్ర క్యారెక్టర్‌.. ప్రభాస్‌ కాదు.. ఆ స్టార్ హీరో చేయాల్సింది

కన్నప్పలో ప్రభాస్‌ పెళ్లి టాపిక్..! విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిల..

వార్ వన్‌ సైడ్.. దిక్కుతోచని స్థితిలో రజనీ

తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *