రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ తర్వాత విమానం డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. విమానంలో బిలాస్‌పూర్ జిల్లా కోట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.దాదాపు గంట పాటు విమానం డోర్లు తెరుచుకోకపోవడం, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో విమానంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరికి ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్పందించారు. సాంకేతిక లోపం కారణంగా డోర్ తెరుచుకోలేదని చెప్పారు. చివరకు రాత్రి 11 గంటల తర్వాత సాంకేతిక సమస్యను సరిచేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో సిబ్బంది విఫలం అవుతున్నారన్న విమర్శలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం :