తుప్పల్లో దొరుకుతుందని చిన్నచూపు చూసేరు.. డయాబెటిస్ సహా ఆ సమస్యలకు రామబాణం..

తుప్పల్లో దొరుకుతుందని చిన్నచూపు చూసేరు.. డయాబెటిస్ సహా ఆ సమస్యలకు రామబాణం..


ప్రకృతి ఎన్నో సహజసిద్ధమైన ఔషధ మొక్కలను ప్రసాదించింది. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా.. దివ్య ఔషధంలా పనిచేస్తాయి.. మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడతాయి.. వాటిలో తులసి, కలబంద, వేప, తిప్పతీగ, గుంటగలగర, పుదీనా లాంటివి విన్నాయి. ఈ ఔషధ మొక్కలు వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఔషధ మొక్కల్లో అతి ముఖ్యమైనది తిప్పతీగ.. ఈ తిప్పతీగతో తిప్పలన్నీ దూరం చేసుకోవచ్చని చెబుతుంటారు.. తిప్పతీగ.. ఆకులు, కాండం, వేర్లు.. అన్ని కూడా శక్తివంతమైనవే.. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయని.. ఇవి మన ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తాయని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు – ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. తిప్పతీగను ఎలా తీసుకున్నా శరీరానికి మంచిదే.. తిప్పతీగ ఆకులతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ ను తయారు చేసి తీసుంటారు. శక్తివంతమైన ఔషధ మొక్కగా అభివర్ణించే తిప్పతీగను తీసుకోవడం ద్వారా.. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోండి..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి, తద్వారా వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: తిప్పతీగ డయాబెటిస్‌లో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తిప్పతీగ సహాయపడుతుందని.. షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది: తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఇవి ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.. తద్వారా నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.

శ్వాసకోశ సమస్యలు దూరం: జలుబు, దగ్గు, ఉబ్బసం, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా తిప్పతీగ సహాయపడుతుంది..

కాలేయం, గుండె సమస్యలు దూరం:  తిప్పతీగ కాలేయం, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. లివర్, హార్ట్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

తిప్పతీగను ఎలా తీసుకోవాలి..

అయితే.. తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు, చూర్ణం, కషాయం లేదా ఆకుల రూపంలో తీసుకోవచ్చు. తిప్పతీగను ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.. అయితే, ఏదైనా సమస్య ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *