తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!

తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!


తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది. హిప్‌హాప్‌ నృత్యంలోనూ శెభాష్ అనిపించుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన ప్రీతి.. పలు యాడ్‌లలోనూ కనిపించింది. ఆ తర్వాత బీటెక్‌ పూర్తి చేసి.. వెండి తెరపై తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. ఇక సినిమాల్లోకి రాక ముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ ‘ముత్తు ము2’. యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌కు దాదాపు 6 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక.. ఓం భీమ్ బుష్‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైందీ అందాల తార. ఈ మూవీలో జలజ అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రీతి. ఓం భీమ్ బుష్’ తర్వాత ప్రీతి చేసిన మ్యూజిక్ వీడియో ‘ఆశ కూడ’ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా ‘మోర్నీ’ మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసిందీ అందాల తార. ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. తన అందంతో… పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలు ఈ బ్యూటీ రావడం పక్కా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంది ప్రీతి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం.. ఎందుకో తెలుసా

మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *