యూకే, మాల్దీవుల పర్యటనల అనంతరం శనివారం ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.4వేల 800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో పాటు, కొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. రెండ్రోజులపాటు తమిళనాడులో పర్యటించనున్నమోదీ తూతూకుడి ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ఇక ఆదివారం గంగైకొండ చోళపురంను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. తర్వాత ఆది తిరువతిరై ఉత్సవంతో పాటు గొప్ప చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గంగైకొండ చోళపురం వద్ద ప్రధాని భద్రతా విభాగం ఉన్నతాధికారులు, అరియలూరు జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.