ఆయుర్వేద వైద్యంలో వందల ఏళ్లుగా తమలపాకును ఔషధంగా వాడుతున్నారు. తాజా తమలపాకులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా తమలపాకులో క్యాల్షియం, విటమిన్ C, విటమిన్ B3, విటమిన్ B2, కెరోటిన్, క్లోరోఫిల్, టానిన్లు, యాంటీసెప్టిక్ గుణాలు వంటివి శరీరాన్ని రక్షణ కలిగించే ప్రధాన మూలకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ఔషధ నిలువలు కలిగిన ఈ తమలపాకును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం జీర్ణవ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది. గ్యాస్, అజీర్తి, అంటా యాసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి తమలపాకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
తమలపాకుతో తయారుచేసిన కషాయం లేదంటే, తమలపాకు ఆకుల్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పిల్లలకు జలుబు, దగ్గు సమయంలో వాడినట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఉపశమనం కలిగిస్తుంది.
భోజనం చేసిన తరువాత తమలపాకును గుల్కంద్, సోంపుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. నోటి దుర్వాసన పోతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. నోటి పూత, చిగుళ్ల బ్లీడింగ్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. తమలపాకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తమలపాకులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నుంచి రక్షిస్తాయి. తమలపాకును చిన్న చిన్న గాయాలు, పుండు వంటి చర్మ సమస్యల రుద్దినా కూడా అవి త్వరగా మానిపోతాయి. తమలపాకుతో మరిగిన నీటిని చర్మానికి రాసినా, లేదంటే, ఆ నీటితో మొఖం కడిగితే చర్మ రుగ్మతలు, చర్మ దురద, అలర్జీలు తగ్గుతాయి.