డీఎంకే-బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మురుగన్ భక్తుల మహానాడు.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో..!

డీఎంకే-బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మురుగన్ భక్తుల మహానాడు.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో..!


తమిళనాడులో మరోసారి డీఎంకే వర్సెస్ బీజేపీగా రాజకీయ రచ్చ మొదలైంది. మే నెల 22వ తేదీన హిందూ మున్నని అనే హిందూ సంస్థ తలపెట్టిన మురుగన్ భక్తుల మహానాడు ఈ వివాదానికి దారి తీసింది. భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది అంటూ డీఎంకే టార్గెట్ చేస్తుంటే, అదే రీతిలో కౌంటర్ ఎటాక్ దిగారు బీజేపీ నేతలు. అయితే భక్తుల సమ్మేళనం కోసం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందంటూ నిర్వాహకులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతినిచ్చి, భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతకీ బీజేపీ-డీఎంకే మధ్య తాజా వివాదానికి కారణం ఏంటి ఒకసారి చూద్దాం..!

తమిళనాడులో ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారులకు రావాలని భారతీయ జనతా పార్టీ అవకాశం ఉన్న ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన ఏటీఎంకేని తమ వైపు తిప్పుకుని, కూటమిని ఏర్పాటు చేసి ఓటు బ్యాంకు కలిగిన మరికొన్ని పార్టీలను ఓటమిలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో పాటు హిందూత్వ అజెండాను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

గత ఏడాది మధురై వేదికగా తమిళనాడు ప్రభుత్వం మురుగన్ తిరువిళా పేరుతో ఉత్సవాలను నిర్వహించింది. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యస్వామికి మరో పేరు. హలో సుబ్రహ్మణ్యస్వామి తిరునాళ్లు పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. డీఏంకే అంటే హేతువాద సిద్ధాంతాలకు పెట్టింది పేరు అన్నట్టు తమిళనాడులో పెద్ద ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే అకాశం ప్రతిసారీ డీఎంకే‌ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపణ చేస్తూనే ఉంది. ఈ ఆపవాదును దూరం చేసుకునేందుకే డీఎంకే సైతం సుబ్రహ్మణ్యస్వామి తిరునాళ్లు పేరుతో మత రాజకీయం చేసిందని అప్పట్లో బీజేపీ కూడా విమర్శలు చేసింది.

ఇప్పుడు అదే వేదికగా మురుగన్ భక్తుల మహానాడు పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి భక్తులందరూ ఒకే వేదికగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 22వ తేదీన అందుకు ముహూర్తంగా రెండు నెలల క్రితమే నిర్వాహకులు నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం వెనక బీజేపీ ఉంది అనేది డీఎంకే ఆరోపణ. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

అయితే 22న జరగాల్సిన మురుగన్ భక్తుల మహానాడుకు అనుమతులు ఇవ్వకుండా డీఎంకే ప్రభుత్వం కావాలని అడ్డంకులు సృష్టిస్తో్ందని బీజేపీ ఆరోపిస్తుండగా.. కార్యక్రమం నిర్వాహకులు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో కోర్టు మురుగన్ భక్తుల మహానాడుకు అనుమతినిస్తూ, భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో మధురై వేదికగా జరిగే ఈ భక్తుల మహానాడుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఇందులో భాగంగా వారం ముందుగానే తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి వివిధ ఆలయాల నమూనాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భక్తుల సమ్మేళనం పేరుతో హిందువులందరిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని, సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో పాటు బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా పలువురు నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు మైనార్ నాగేందర్ ఆహ్వానించారు. అయితే ఇది రాజకీయ సభ కాకుండా మరి ఏమిటని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే, గత ఏడాది డీఎంకే ప్రభుత్వం ఇదే మధురై వేదికగా చేపట్టిన మురుగన్ తిరువిళా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే, మరెంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మతానికి తమిళనాడులో మరోసారి మధురై వేదికగా జరగనున్న సుబ్రహ్మణ్యస్వామి భక్తుల మహానాడు అంశం వేదికగా రాజకీయ రచ్చ మొదలైంది. ముగింపు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *