టైటానిక్ షిప్ గుర్తుంది కదా.. దానికి ఈ లేఖకు లింక్ ఉంది. అందుకే ఆ లెటర్ అంత ధరకు అమ్ముడు పోయింది. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? ఎవరు ఎవరికి రాశారు? టైటానిక్ మృత్యుంజయుడు కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ.. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రేసీ తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కి నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో ఓషియానిక్‌లో ప్రయాణించిన జ్ఞాపకాలను ఆ లేఖలో రాసినట్టు తెలుస్తోంది. రాత్రి 11.40 గంటల సమయంలో టైటానిక్ షిప్ ఇంజిన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా నిద్రనుంచి మేల్కొన్న గ్రేసీ ఎందరో మహిళలు, చిన్నారులను లైఫ్ బోట్లలోకి తరలించి సహాయం చేశారు. చలినుంచి వారిని కాపాడటానికి దుప్పట్లు సేకరించి అందించారు. చివరికి ఓడ అట్లాంటిక్ అలలలో మునిగిపోయినప్పుడు, గ్రేసీ, ఇంకా కొందరు గజ ఈతగాళ్ళు సహాయం కోసం కేకలు వేశారు, తలక్రిందులుగా ఉన్న పడవను పట్టుకున్న సగం మందికి పైగా ప్రజలు తెల్లవారకముందే అలసిపోయి, చలితో మరణించారని ఆ లేఖలో రాస్తూ గ్రేసీ భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడున్నాడు అనడానికి నిదర్శనం.. ఈ సీన్ !!
సామాన్యులకు చిక్కనంటున్న చింతచిగురు.. @1000/-
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి పండగే..!
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..
వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్ సూచన..!