అయితే నవ గ్రహాల్లో ఒకటైన బుధుడు జూన్ 6వ తేదీన తన రాశిని మార్చుకుంటున్నాడు. జూన్లో బుధ గ్రహం మితు రాశిలోకి సంచారం వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక పరమైన కష్టాలు , అంతే కాకుండా అనేక సమస్యలు ఎదురు కానున్నాయంట.కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా సమస్యలు ఎదురు అవుతాయి. కష్టపడినా పూర్తి ఫలితం దక్కదు. ఉద్యోగంలో అధికారులు ఏదో విషయంపై కోపగించుకోవచ్చు. వ్యాపార పరిస్థితి కూడా అంత బాగా ఉండదు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
వృషభ రాశి : బుధ గ్రహం సంచారం వలన వృషభ రాశి వారికి అస్సలే కలిసి రాదు. ఏ పని చేపట్టినా అందులో వారు విఫలం అవుతారు. అందుకే ఈ రాశి వారు జూన్ నెల మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదంట.
వృశ్చిక రాశి : నెల రోజులు మాత్రం ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వారి తెలివితేటలు తప్పుడు పనుల వైపు మళ్ళవచ్చు, దీనివల్ల వారు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఊహించని ఖర్చులు పెరిగి సమస్యల్లో చిక్కుకుంటారు.
కుంభ రాశి : బుధ గ్రహం సంచారం వలన కుంభ రాశి వారికి ఆర్థికంగా అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి చాలా కష్టం అవుతుంది.అప్పులు పెరుగుతాయి.అన్నింట్లో సమస్యలు ఏర్పడుతాయి.