జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రాత్మక రోజు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రాత్మక రోజు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోదీ


పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6) తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన చీనాబ్, భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన అంజిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దీనితో పాటు, కాట్రాలో రూ.46,000 కోట్లకు పైగా వ్యయంతో తలపెట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, వాటిని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ.

జమ్ముకశ్మీర్‌ను భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌తో లింక్ చేయడం అనేది శతాబ్దం కిందటి కల. చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్‌వర్క్‌తో జమ్ముకశ్మీర్​ అనుసంధానం కానుంది. మరికొద్ది గంటల్లో కాత్రా- శ్రీనగర్ వందే భారత్ రైలు మొదలు కానుండగా, భారత్‌కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితం ఇవ్వనుంది. శుక్రవారం(జూన్ 06) ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అదే వంతెన మీదుగా వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపనున్నారు. ఈ వంతెన ఎంత ఎత్తులో ఉంటుందంటే కుతుబ్ మీనార్, ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ. ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. వంతెన ప్రారంభం అనంరతం కాత్రాలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

తన పర్యటన గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, శుక్రవారం(జూన్ 06) జమ్మూ కాశ్మీర్‌కు ముఖ్యమైన రోజు అని అన్నారు. దాదాపు రూ.46000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తాం. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జీవన ప్రమాణాలను మారుస్తుంది. కాట్రా-శ్రీనగర్ వందే భారత్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. చీనాబ్ రైల్వే వంతెన అసాధారణ విజయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

చీనాబ్ నదిపై లోయలో రెండు పర్వతాల్ని కలుపుతూ నిర్మించారు చీనాబ్ రైల్వే వంతెన. ఈ కొత్త రైలు మార్గం ద్వారా జమ్ము శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇకపై జమ్ము నుంచి శ్రీనగర్ కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. చీనాబ్ వంతెన చీనాబ్ నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉన్న బక్కల్, కౌరి గ్రామాలను అనుసంధానిస్తుంది. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్ర నిర్మించింది.

భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ హైట్ దీని సొంతం.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఐదురెట్లు ఎక్కువ ఎత్తును చీనాబ్ వంతెన కలిగి ఉంది. దాదాపు 2.86 కోట్ల కేజీల స్టీల్‌ను ఈ వంతెన నిర్మాణానికి వినియోగించారు. మైనస్ 10 డిగ్రీల సెల్సీయస్ నుంచి మొదలుకుని గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సీయస్‌గా ఉష్ణోగ్రతల్లోనూ ఈ వంతెనను వాడుకోవచ్చు. 1.31 కి.మీ మేర విస్తరించి ఉన్న చీనాబ్ వంతెన నిర్మాణానికి కేంద్ర 14వందల 86 కోట్లు ఖర్చు చేసింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *