జడ్జి గారు.. ప్లీజ్.. ఆ విగ్రహాల విలువలో సగం ఇప్పించండి.. అసలు మ్యాటర్ ఏంటంటే..

జడ్జి గారు.. ప్లీజ్.. ఆ విగ్రహాల విలువలో సగం ఇప్పించండి.. అసలు మ్యాటర్ ఏంటంటే..


అవి పురాతన విగ్రహాలు.. ఏ కాలం నాటివో ఇంకా పురావస్తు శాఖ అధికారులు తేల్చలేదు. అయితే ఆవిగ్రహాల విలువలో కొంత తనకి ఇప్పించాలంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హై కోర్టు ఆ విగ్రహాలు ఏ కాలం నాటివో తేల్చాలని చెప్పడంతో అధికారులు ఉరుకు పురుగుల మీద అంచనాలు వేయడం మొదలు పెట్టారు. అసలు విషయం ఏంటంటే.. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో చందోలు అనే గ్రామం ఉంది. ఈ చందోలు గ్రామమే ఒకప్పుడు చందవోలు పేరుతో ప్రసిద్ది చెందిన రాజధాని నగరం.. ఈ గ్రామంలో 2013లో అన్వరీ అలీ తన వ్యవసాయ భూమిలో దున్నుతుండగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాలతో పాటు పురావస్తు సామాగ్రి వెలుగు చూసింది.

ఇందులో విష్ణు మూర్తి విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహాలు, ఇంకా కొన్ని పూజా సామాగ్రి బయటపడింది. ఈ విషయం తెలియడంతోనే రెవిన్యూ ఉద్యోగులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని బాపట్లలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించి భద్ర పరిచారు. అయితే ఆ రైతు ఇప్పుడు తమ భూమిలో దొరికిన విగ్రహాల విలువలో ఎంతో కొంత భాగం తనకు ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హై కోర్టు ఆ విగ్రహాల ఎక్కడున్నావో.. అవి ఏ కాలం నాటివో పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.

దీంతో పురావస్తు శాఖాధికారులతో పాటు పివిపాలెం తహశీల్ధారు వెంకటేశ్వరావు, చందోలు వీఆర్వో అరుణ ప్రసన్న తదితరలు కలిసి బాపట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న విగ్రహాలను పరిశీలించారు. ఎన్ని విగ్రహాలున్నాయో లెక్కించారు. మరో రెండు రోజుల్లో పురావస్తు శాఖాధికారులతో కలిసి వాటి విలువ కూడా మదింపు చేయనున్నారు. ఆ విషయాన్ని కోర్టుకు నివేదిక రూపంలో అందించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *