ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే

ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే


ఇది ఒడియా సినిమా. అయితే పేరుకు ఒడియా సినిమా అయినప్పటికీ… ఈ మూవీ థియేటర్లలో సంచలన విజయాన్ని సాధించింది. రాజ పర్వ పవిత్ర పండగ సందర్భంగా జూన్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా టెర్రిఫిక్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. కేవలం రూ.3 కోట్లతో నిర్మించిన బౌ బుట్టు భూటా.. ఇప్పటికే రూ.15.1 కోట్లు.. అంటే పెట్టిన ఖర్చు కంటే దాదాపు 400% కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఫీట్‌తో ఛావా సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఒడియా సంస్కృతి, జానపద కథలలో లోతుగా పాతుకుపోయిన భయానక , కామెడీల మిశ్రమమే ఈ సినిమా విజయానికి కారణమని చెప్పొచ్చు. ప్రతీకార స్పూర్తి ఉన్న ఓ చేపల రైతు.. బుట్టు కథతో సాగిన ఈ మూవీలో స్థానిక సంప్రదాయలు, నమ్మకాలను చూపిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రణబ్ ప్రసన్న రథ్ రాసిన డైలాగ్స్, మహ్మద్ ఇమ్రాన్ స్క్రీన్ ప్లే, ఈ సినిమాలో అద్భుతంగా కుదిరాయి. ఇక.. 130 కోట్లతో తెరకెక్కిన ఛావా మూవీ… రూ.615 కోట్లు వసూలు చేయగా, పర్సెంటేజ్‌ పరంగా చూస్తే.. బౌ బుట్టు భూటా కంటే వెనకే ఉందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పర్సెంటేజ్‌ పరంగా ఎక్కువ వసూళ్లు సాధించింది సినిమానేని వారు లెక్కతేల్చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ..

అనసూయను మోసం చేసి డబ్బు గుంజిన కేటుగాళ్లు

చిరులా.. నోరు జారిన నాగ్‌ రజినీ ఫ్యాన్స్ సీరియస్

ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా…

రూ.1000 కోట్లతో సినిమా తీస్తా !! శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాకవుతున్న ప్రొడ్యూసర్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *