Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ప్రారంభం అవుతున్న టైమ్‌లో టీమిండియాను భయపెట్టే ఘటన జరిగింది. ఇప్పటికే దుబాయ్‌కి వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా హార్థిక్ పాండ్యా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతను కొట్టిన బాల్ నేరుగా వెళ్లి రిషభ్ పంత్ ఎడమ మొకాలికి తాకింది. దాంతో పంత్ అక్కడే కిందపడిపోయాడు. బాల్ గట్టిగా తాకడంతో పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫీల్డింగ్ కోచ్, మెడికల్ టీమ్ పంత్ వద్దకు పరిగెత్తుకు వచ్చింది. హార్థిక్ పాండ్యా సైతం పంత్ వద్దకు వచ్చి సారీ చెప్పాడు.
అయితే అక్కడిక్కడే కాస్త ఫస్ట్ ఇచ్చిన తర్వాత మెడికల్ టీమ్ పంత్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లింది. ఆ ఆ తర్వాత కొద్ది సేపటికి పంత్ ప్యాడ్స్ కట్టుకొని ప్రాక్టీస్ కోసం వచ్చాడు. కానీ, అంత కంఫర్ట్‌బుల్‌గా అనిపించలేదు. మోకాలికి తగిలిన దెబ్బ, గాయంగా మారుతుందా అనే భయం టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉంది. ఇంకా టోర్నీ ప్రారంభం కాకుండానే పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ ఇలా నొప్పితో బాధపడుతుండటం క్రికెట్ అభిమానులను కూడా కాస్త కలవరపెడుతోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే.. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే పంత్‌కు తగిలిన దెబ్బ ఇబ్బంది కరంగా మారినా కూడా టీమిండియాకు పెద్ద నష్టం లేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా తమ మొదటి ఛాయిస్ కేఎల్ రాహుల్ అని గౌతమ్ గంభీర్ పేర్కొ్న్న విషయం తెలిసిందే. ఈ లెక్కన పంత్‌కు తొలి రెండు మ్యాచ్‌ల్లో నూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే. అయితే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైనా, లేదా గాయపడినా, లేక గంభీర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలని భావించినా పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు.
🚨Pant hurt by a shot from Hardik. The left knee is now strapped after applying the ice pack. @rohitjuglan reports.#ChampionsTrophy2025 pic.twitter.com/nh8e3tuA0i
— RevSportz Global (@RevSportzGlobal) February 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.