కానీ అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేటుగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులనే ఆశ్చర్యపరిచారు. గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగసముద్రం శివారులో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు షాక్ అయ్యారు. బహుశా గుప్త నిధులు తవ్వకాలలో ఫస్ట్ టైం అత్యాధునిక టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి కావచ్చు! గుప్త నిధుల కోసం… వాటిని గుర్తించేందుకు ఏకంగా మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్లను తీసుకొచ్చి గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ముఠా గుట్టురట్టు చేశారు. నాగసముద్రం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్లు గుంతకల్ రూరల్ పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు.. గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన మహేంద్ర అనే వ్యక్తి మరో నలుగురితో గుంతకల్‌కు వచ్చాడు. గుంతకల్ కు చెందిన రాముతో కలిపి మొత్తం 9 మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుంతకల్ పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం వేట మొదలుపెట్టారు. నాగసముద్రం శివారు కొండపై ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం పరిసరాలలో మహేంద్ర అండ్ కో ముఠా గుప్తనిధుల కోసం గత కొద్దిరోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి
Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!
బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్ కథ! ది బెస్ట్ డార్క్ థ్రిల్లర్ సిరీస్!
ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??
Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే