చిన్న వయసులో క్యాన్సర్ రాదన్నారు.. వైద్యుల నిర్లక్ష్యానికి నేడు జీవితపు చివరి దశ పోరాటం చేస్తున్న యువతి..

చిన్న వయసులో క్యాన్సర్ రాదన్నారు.. వైద్యుల నిర్లక్ష్యానికి నేడు జీవితపు చివరి దశ పోరాటం చేస్తున్న యువతి..


ఇంగ్లాండ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఆలిస్ గ్రీవ్స్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలిస్ మూడేళ్ళ క్రితం తన రొమ్ములో ఒక చిన్న గడ్డ ఉన్నట్లు గుర్తించింది.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళింది. అయితే ఈ గడ్డ కేవలం వ్యాయామం వల్ల వచ్చిన కండరాల సమస్య .. ఇంత చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు” అని చెప్పి ఎటువంటి పరీక్ష చేయకుండా ఆలిస్ ని డాక్టర్ పంపేశాడు. ఇలా మూడేళ్ళు గడిచాయి. ఇప్పుడు ఆ యువతి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ కి చేరుకుంది. పరీక్ష ఆలస్యం కావడంతో క్యాన్సర్ శరీరంలో మెదడు, ఊపిరితిత్తులు వంటి ఇతర భాగాలకు వ్యాపించింది. ఈ విషయం తెలిసిన ఆలిస్ ఇతరులకు కొన్ని సలహాలు సూచలు చేస్తోంది. డాక్టర్స్ మీకు ఏమి చెప్పినా సరే.. అదనపు పరీక్షల కోసం పట్టుబట్టమని హెచ్చరిస్తోంది.

లీసెస్టర్ నివాసి అయిన ఆలిస్ కి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత చికిత్స ప్రారంభించారు. ఇప్పటికే 16 రౌండ్లు కీమోథెరపీ చికిత్స తీసుకుంది. అయినా సరే క్యాన్సర్ ఆమె ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు వ్యాపించింది.

గతంలో ఫైనాన్స్‌ రంగంలో పనిచేసిన ఆలిస్ ఇప్పటికే రెండుసార్లు మాస్టెక్టమీ చేయించుకుంది. అయితే తాను వెళ్ళినప్పుడే వైద్యులుపరీక్షించి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. వయసు తక్కువ క్యాన్సర్ రాదు అని డాక్టర్ చెప్పిన మాటని నమ్మేశానని డాక్టర్ తీరు తనని తీవ్ర నిరాశని కలిగించింది అని చెప్పింది. అంతేకాదు నేను డాక్టర్ ని అదనపు పరీక్షలు చేయమని బలవంతం చేయకపోవడం కూడా నా తప్పని తనపై తనకే కోపం వచ్చిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు శస్త్రచికిత్స చేసి రెండు రొమ్ములు తొలగించారు. మరోవైపు మెదడులో క్యాన్సర్ వ్యాపించడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. మరోవైపు ఊపిరితిత్తుల్లోని క్యాన్సర్‌ను తొలగించేందుకు చికిత్స జరుతోందని చెప్పింది.

బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో మీరే స్వయంగా చెక్ చేసుకొంటున్న ఆలిస్

క్రమం తప్పకుండా స్వీయ-రొమ్ము పరీక్షలు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడంలో మీకు సహాయపడతాయి. చాలా గడ్డలు క్యాన్సర్ కానప్పటికీ.. వాటిని గమనించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది.

రొమ్ములో ఏదైనా మార్పు, చర్మం ముడతలు లేదా నిపుల్ స్థానం మారడం, ఏదైనా గడ్డలు కనిపించినా.. వెంటనే పరీక్ష చేయించుకోమని హెచ్చరిస్తోంది ఆలిస్. ఒకవేళ వైద్యులు కాదన్నా.. అదనపు పరీక్షల కోసం పట్టుబట్టమని సూచిస్తోంది.

అద్దం ముందు నిలబడి చేతులు పైకి ఎత్తి రొమ్ము ఆకృతిలో మార్పులు, రొమ్ము వాపు, చర్మంలో గుంతలు లేదా చనుమొనల స్థితిలో ఏవైనా మార్పులు ఉన్నాయా అని చూడండి.

పడుకున్నప్పుడు వేళ్ళ కొనలతో రొమ్ము మొత్తం భాగాన్ని నొక్కి పరీక్షించండి. చంక, కాలర్‌బోన్, పొత్తికడుపుని నొక్కి పరీక్షించడం వంటి పద్ధతులు క్యాన్సర్ గుర్తించడానికి సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *