
చామదుంపను చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ దాని వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ దుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుుంది. ఇన్సులిన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్, ఇ విటమిన్, మెగ్నిషియం నిండి ఉంటుంది. ఈ పోషకాలను కలిగి ఉన్న చామ దుంపను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకూ ఇది ఉపయోగపడుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతాయి.
అధిక బరువు ఉన్న వారు తరచూ చామదుంపని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇది తిన్నాక ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. వెజిటేరియన్లకు ఈ దుంప వరమనే చెప్పాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపు మెరుగు పరుస్తుంది. కంటి కణాల క్షీణతను తగ్గిస్తుంది. రూట్ వెజిటబుల్ అయిన చామదుంపలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.
చామదుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల ఇన్సులిన్ విడుదల నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. చామదుంపులు ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రక్తం స్థాయిలో పెరుగుతాయి. చామ దుంపలో పోటాషియం అధికంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి లాభం చేకూరుతుంది. చామదంపు మూలాల్లో డయోస్జెనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేయడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..