రోటీలు, పూరీలు, చపాతీలు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. చపాతీ, రోటీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం, రాత్రి పూట కూడా వీటినే తింటున్నారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ చేయడానికి మాత్రం కాస్త శ్రమించాల్సిందే. పిండిని పిసికి, చపాతీలను చేసి.. కాల్చి చేయాలి. ఏది ఎలా ఉన్నా పిండి సరిగ్గా కలిపితేనే చపాతీలు, రోటీలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పిండి కలిపేటప్పుడు చేతులకు జిగటగా ఉంటాయి.