చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు


చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

చదవడం చాలా మంది చేయగలిగిన పనే అయినా చదివిన విషయాన్ని మదిలో నిలుపుకోవడం మాత్రం అంత సులభమైన పని కాదు. ఎన్నో గంటలు చదివిన తర్వాత పరీక్షల సమయంలో ఒక్క విషయం కూడా గుర్తుకు రాకపోవడం అనేక మందిలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే కొన్ని సరళమైన అలవాట్లు మన మెమొరీ పవర్‌ను బాగా పెంచుతాయి.

చదవడానికి మీరు కూర్చోబోయే ప్రదేశం శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండాలి. చుట్టూ శబ్దాలు లేకుండా ఏ గడబిడీ లేకుండా ఉంటే చదివే విషయంపై పూర్తి దృష్టి పెట్టడానికి మన మెదడుకు అవకాశం లభిస్తుంది. ఇది చదవడాన్ని ఆలోచనాత్మకంగా మార్చుతుంది.

ఏదైనా పదాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాని మొదటి అక్షరాన్ని గుర్తుంచుకోవడమే సరళమైన పద్ధతి. ఆ మొదటి అక్షరం గుర్తుకొచ్చినపుడు.. దాని ఆధారంగా మిగతా పదమంతా గుర్తుకు రావడంలో మెదడుకు సహాయపడుతుంది.

చదివేది కేవలం మార్కుల కోసమే అని భావిస్తే మనలో ఒత్తిడి పెరుగుతుంది. పరీక్షల కోసం కాదు జ్ఞానం కోసం చదవాలి అనే దృక్పథంతో ముందుకెళ్తే చదవడం ఆనందంగా అనిపిస్తుంది. ఆసక్తిగా చదివిన విషయాలు ఎక్కువకాలం మెదడులో నిలుస్తాయి.

ప్రతి పాఠంలోనూ ముఖ్యాంశాలను గుర్తించి వాటిని చిన్నచిన్న వాక్యాలుగా లేదా పాయింట్లుగా రాసుకోవాలి. పరీక్షల సమయంలో పుస్తకం మొత్తం తిరగకుండానే ఈ నోట్సు తేలికగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

చదివిన విషయాన్ని కొంతసేపటి తర్వాత మళ్లీ మదిలో తలదన్నుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఆ విషయాలు మెదడులో ఎక్కువ కాలం నిలిచిపోతాయి. రోజూ కనీసం ఒక్కసారి పునరావృతం చేయడం ఉత్తమ పద్ధతి.

ఎప్పటికప్పుడు అదే ప్రదేశంలో చదవడం వలన విసుగు కలగవచ్చు. దీన్ని నివారించేందుకు చదివే ప్రదేశాన్ని మార్చండి. మారిన వాతావరణం మనసుకు సాహిత్య పట్ల కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

మెదడు చురుకుగా ఉండాలంటే శరీరానికి సరైన విశ్రాంతి అవసరం. ప్రతిరోజూ రాత్రి పదింటికి నిద్రపోయి, ఉదయం ఐదింటికల్లా లేచి రోజును ప్రారంభించండి. ఈ అలవాట్లు మెదడుకు కొత్త శక్తిని ఇస్తాయి. మానసిక ఉత్తేజం పెరగడం వల్ల మెమొరీ నైపుణ్యాలు మెరుగవుతాయి.

చదివిన విషయాలను సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే.. పై టిప్స్‌ను రోజువారీ జీవితంలో సాధన చేయడం అవసరం. చదువు పరంగా మెరుగైన ఫలితాల కోసం ఇవి నమ్మదగిన మార్గాలు. మీరు ఈ టిప్స్‌ను ఎప్పటికప్పుడు అమలు చేస్తే మంచి మెమొరీతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *