అయితే సిధిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే హిమనీ నదం కూలిపోవడంతో ఒక్కపట్టణ అందమైన గ్రామం సిధిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు. వాలెస్ ప్రాంతంలోని లాట్చెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లాంజా నదికి అడ్డుకట్టబడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్ కిప్పెల్ మునిసిపాలిటీలోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :