
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది. శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది.
ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్
శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. సలార్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న శ్రియ రెడ్డి.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ నటిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రియ రెడ్డి విలన్ గా నటించనుందని టాక్. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ ఫొటోలతో కవ్విస్తుంది.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.