ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్ భారతదేశంలో నిర్మిస్తున్నారు. అవును, దీనిని ఇండియన్ ఆయిల్, BPCL, HPCL కలిపి నిర్మిస్తున్నాయి. దీని పొడవు 2800 కిలో మీటర్లు అని తెలిసింది. ఇకపోతే రూ. 112 బిలియన్ల వ్యయంతో ఈ భారీ పొడవైన గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. ఈ LPG పైప్‌లైన్ గుజరాత్ లోని కాండ్లా నుండి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు విస్తరించి ఉంది. ఇది ఈ సంవత్సరం అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.
ఇందులో ఇండియన్ ఆయిల్ 50 శాతం వాటాను కలిగి ఉండగా, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ 25-25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఇంధన రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.112 బిలియన్ల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ఇంధన సరఫరాలో వందలాది ట్రక్కులను భర్తీ చేస్తుంది. అందిన సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాలు ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్ పథకం ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతాయి. ఈ గ్యాస్ పైప్‌లైన్ పథకం వల్ల ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా ప్రయోజనం పొందుతాయని సమాచారం.
ఈ ప్రాజెక్టులో కొంత భాగం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెట్వర్క్ ఏటా 8.3 మిలియన్ టన్నుల LPGని రవాణా చేయగలదు. 8.3 మిలియన్ల LPG అంటే భారతదేశ మొత్తం డిమాండ్‌లో దాదాపు 25శాతం ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…