విశ్వక్ సేన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నీ డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక విశ్వక్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో గామీ సినిమా ఒకటి. గామి ఓ డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించి మెప్పించాడు. గామి 2024లో విడుదలైంది. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్ తో పాటు చాందిని చౌదరి, అభినయ, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
ఇక ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమా ఓ చిన్న పాప కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఉమ అనే పాత్రలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ఈ చిన్నారి పేరు హారిక. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ చిన్నారి. గామి సినిమా విడుదలై కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ జరిగి చాలా కాలం అయ్యింది. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హారిక ఇప్పుడు క్యూట్ లుక్ లోకి మారిపోయింది. ఈ టీనేజ్ చిన్నది త్వరలోనే హీరోయిన్ అవుతుందని అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు. చక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఉన్న ఈ చిన్నది హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.. చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా సినిమాలు చేశారు. అలాగే హారిక కూడా హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుందేమో చూడాలి. హారిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.