గత్తరలేపిన దృశ్యం పాప..! కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా..

గత్తరలేపిన దృశ్యం పాప..! కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా..


విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అయ్యింది. 2014 లో విడుదలైన ఈ మూవీ మలయాళం, తెలుగు రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన చిన్నది గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఆ చిన్నదాని పేరు.. ఎస్తేర్ అనిల్. 2010లో మలయాళ చిత్రం నల్లవన్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత 2013లో జిత్తు జోసెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటించిన దృశ్యం చిత్రంలో చిన్న కూతురుగా నటించి పేరు తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ఇదే పాత్ర చేసింది. వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించింది. అలాగే తమిళ్ రీమేక్ లోనూ ఈ చిన్నది నటించింది. తమిళ్ లో కమల్ హాసన్ నటించారు.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

ఆతర్వాత 2021లో విడుదలైన దృశ్యం 2లో ఎస్తేర్ అనిల్ కాలేజీ విద్యార్థినిగా నటించింది. అలాగే మలయాళం, తమిళ్ లోనూ నటించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హలితా షమీ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన తమిళ చిత్రం మిన్మినిలో ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా చేసింది. ఎస్తేర్ తమిళం, మలయాళం చిత్రాలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించనుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. తన గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ ఫొటోలకు అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. ఆగస్ట్ 27, 2001న జన్మించిన ఎస్తేర్ అనిల్ ఇటీవలే తన 23వ పుట్టినరోజు జరుపుకుంది.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *