ఖర్చు లేకుండా ఇంటిని మెరిపించండి.. అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు మీకోసం..!

ఖర్చు లేకుండా ఇంటిని మెరిపించండి.. అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు మీకోసం..!


ఖర్చు లేకుండా ఇంటిని మెరిపించండి.. అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు మీకోసం..!
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

మన రోజువారీ జీవితంలో ఇంటి పనులు కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలతో ఈ పనులను తేలికగా చేసుకోవచ్చు. ఇవి శ్రమను తగ్గించడమే కాకుండా ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.

పురుగుల నివారణకు బిర్యానీ ఆకులు

వంటింట్లో ధాన్యాల్లో పురుగులు రావడం మామూలే. వాటిని నివారించడానికి బిర్యానీ ఆకులను ధాన్యాల డబ్బాల్లో వేసి ఉంచండి. అప్పుడు ధాన్యాలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.

నిమ్మ తొక్కతో గిన్నెల మెరుపు

నిమ్మరసం తీసిన తర్వాత దాని తొక్కను పారేయకుండా ఉపయోగించండి. గిన్నెలపై ఉన్న గట్టి మరకలను రుద్దడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాని వల్ల గిన్నెలు మళ్లీ కొత్తవాటిలా మెరుస్తాయి.

బట్టలకు వేప ఆకులు

బట్టలు పెట్టే అల్మారాల్లో కొన్నిసార్లు పురుగులు వస్తాయి. వాటిని నివారించడానికి బట్టల మధ్యలో కొన్ని వేప ఆకులను ఉంచండి. అవి బట్టలను పురుగుల నుండి కాపాడతాయి.

ఊరగాయలకు ఆవ నూనె

ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో ఆవాల నూనె కలపడం మంచిది. ఇది ఊరగాయ రుచిని పెంచడమే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా చేస్తుంది.

చీమలకు పసుపు

ఇంట్లో చీమల సమస్య ఉంటే పసుపు పొడిని వాడవచ్చు. చీమలు వెళ్లే దారుల్లో పసుపు చల్లితే అవి అక్కడికి రాకుండా దూరంగా వెళ్తాయి.

పండ్ల ఈగలకు వెనిగర్

పండ్ల దగ్గర చిన్న చిన్న ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని నివారించడానికి ఒక గిన్నెలో వెనిగర్‌తో పాటు కొన్ని లవంగాలు వేసి మూత పెట్టండి. ఈ వాసనకు ఈగలు దూరంగా ఉంటాయి.

మొక్కలకు గంజి నీళ్లు

బియ్యం కడిగిన తర్వాత మిగిలే గంజి నీళ్లను పారేయకుండా చల్లార్చి మొక్కలకు పోయండి. గంజి నీటిలో ఉండే పోషకాలు మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *