నివేదా 2002లో మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య అనే సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో జయరామ్ కుమార్తెగా నటించి మెప్పించింది. తన నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్మన్ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంతో సైమా ఉత్తమ తొలి నటి (తెలుగు) అవార్డును గెలుచుకుంది. తన నటనతో క్యూట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ.
ఆ తర్వాత నానితో నిన్ను కోరి, ఎన్టీఆర్ తో జై లవ కుశ , కళ్యాణ్ రామ్ 118 , శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా ,నాని వీ (2020), పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శాకినీ డాకినీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. నివేదా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తుంది.
2024లో విడుదలైన 35 చిన్న కథ కాదు చిత్రంలో ఈ చిన్నది తల్లి పాత్రలో నటించి, మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా కథాంశం కె. విశ్వనాథ్ చిత్రాల స్ఫూర్తిని గుర్తు చేస్తుందని నివేదా పేర్కొంది.
నివేదా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోలు మరియు సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కొన్ని పిక్స్ ను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.