కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?


చాలా మంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను, లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు. ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రావు గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాదు మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది రాశి. అప్పట్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది రాశి.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అప్పట్లో రాశి నటించిన సినిమాల్ని సూపర్ హిట్ గా నిలిచాయి. దేవి అభయం అనే సినిమా తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టింది. ఆతర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రాశి. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది. జానకి కనగనలేదు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అయితే రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చినా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. శ్రీముని అలియాస్ ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట. ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు.. ఆసమయంలో శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట.. ఆతర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరుల, వ్యాపారవేత్తల సంబంధాలు వచ్చాయట.. అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్ గా చెప్పి పెళ్లి చేసుకుందట. తన లవ్ స్టోరీని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Raasi
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *