శ్రావణ మాసంలో పెళ్లి సందళ్లు మొదలు కాబోతున్నాయి. కళ్యాణం, కమనీయం అంటూ వాట్సాప్లో స్టేటస్లు మోగిపోనున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో రెండు మనసులు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నాయి. ప్రతి వాడలో వివాహ సందడి మొదలు కానుంది.
హిందూ సంప్రదాయాల ప్రకారం మంచి ముహుర్తంలో వివాహం చేస్తుంటారు. దానికి మంచి రోజు తేదీ, ఇవన్నీ చూడటం ఆచారం. అయితే చాలా రోజుల నుంచి వివాహాలకు శుభ ముహుర్తాలు లేవు. దీంతో చాలా మంది మంచి ముహుర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయిదే శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయంటున్నారు పండితుల. కాగా ఏ నెలలో ఏ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయో చూద్దాం.
జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలు కానున్నది. అయితే శ్రావణ మాసం ప్రారంభంలో జూలై 27 నుంచి ఆగస్టు 30 వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంట. మళ్లీ తర్వాత కార్తిక మాసంలోనే పెళ్లీలకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు.
ఆగస్టు నెలలో 21,22,23,28,29,30వ తేదీలు వివాహాలకు మంచి ఘడియలంట.చాలా రోజుల నుంచి తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం అని. వివాహం చేయాలనుకునేవారు ఈ రోజుల్లో వివాహం చేయవచ్చునంట.
ఇక తేదీల తర్వాత అక్టోబరు 1,2,6,15,27 మంచి రోజులు. అలాగే కార్తీక మాసంలో నవంబర్ 5,10,25 రోజుల్లోమంచి మూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీన్ని బట్టి తమ పిల్లలకు వివాహం చేయాలనుకునే తల్లిదండ్రులు తమ పురోహితులను సంప్రదించి వివాహం జరిపించుకోవచ్చునంట.