
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f
ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో. గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటిపడింది విషాద దృశ్యం. పొగ మంటలతో నిండిన ఆ ఇంటి మొదటి అంతస్తులో కనిపించింది మహిళా మృతదేహం. కానీ తను ఒంటరిగా లేదు. ఆమె చేతుల్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఓ పసికందు. మొబైల్ టార్చ్ వెలుగులో బయటపడేందుకు మార్గం ఏదైనా దొరుకుతుందని ఆ మహిళ చివరి దాకా ప్రయత్నించింది. ఓవైపు మంటలు మరోవైపు పొగతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి.