వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వేదికపై వధూవరులు ఉన్నారు. వధువుకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలని వరుడికి అతడి స్నేహితులు సూచించారు. ఎలా ప్రపోజ్ చేయాలో ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని చూపించాడు. అయినా వరుడు మాత్రం అలా చేయలేకపోయాడు. మోకాళ్ల మీద కూర్చోవడానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు నావల్ల కాదురా బాబు.. అని నిలబడే వధువు చేతికి గులాబీ అందించాడు. అప్‌సెట్ అయిన వధువు తప్పనిసరై ఆ పువ్వును అందుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు లక్షలమంది లైక్ చేశారు. ఆ వరుడు ప్రస్తుత ప్రపంచంలో ఉండాల్సిన వాడు కాదు అని ఒకరు కామెంట్ చేశారు. అతడు చాలా అమాయకుడిలా ఉన్నాడు అని మరొకరు స్పందించారు.
మరిన్నివీడియోల కోసం :
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో