చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్నవి చాలానే ఉన్నాయి. వాటిలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా ఒకటి. విలేజ్ రస్టిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా జులై 18న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఆమె గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాల నిర్మాతగా, నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు, గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మించారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఆగస్టు 22న ఆహాలో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
కథ విషయానికొస్తే.. 1997లో విశాఖ జిల్లాలోని కొత్తపల్లి అనే చిన్న గ్రామంలో కథ జరుగుతుంది. అప్పన్న (రవీంద్ర విజయ్) అనే వడ్డీ వ్యాపారి గ్రామస్థులను అధిక వడ్డీలతో ఇబ్బంది పెడుతుంటాడు. రామకృష్ణ (మనోజ్ చంద్ర) అనే యువకుడు అప్పన్న దగ్గర పనిచేస్తూ, రికార్డింగ్ డాన్స్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. అతను రెడ్డి గారి (బెనర్జీ) మనవరాలితో ప్రేమలో ఉంటాడు, కానీ ఆమెతో డాన్స్ ఆడించేందుకు ఆదిలక్ష్మి (ఉషా బోనెల) అనే యువతితో పరిచయం పెంచుకుంటాడు. ఒక సంఘటనలో రామకృష్ణ, ఆదిలక్ష్మిలకు ఊరి పెద్ద రెడ్డి గారు పెళ్లి చేయమని తీర్పు చెబుతాడు. అప్పన్న ఆకస్మిక మరణం, గ్రామస్థులు అతన్ని దేవుడిగా కొలవడం, రెడ్డి గారి ప్రతిష్ఠకు సంబంధించిన నిర్ణయాలు కథలో మలుపులు తెస్తాయి. ఆతర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి.