ఆమె ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె కనిపిస్తే చాలు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. తన ముద్దుముద్దు మాటలతో క్యూట్ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఆమె.. ఇంతకూ ఆ నటి ఎవరో తెలుసా.? ఒకప్పటి అందాల భామ మహేశ్వరీ. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుల్లో మహేశ్వరీ ఒకరు. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’.. అని పాట వినగానే అందరి మదిలో మెరిసే అందాల తార మహేశ్వరి. 1995లో ముత్యాల సుబ్బయ్య దర్శకతంలో వచ్చిన అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. మాటలకు యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది. అయితే మహేశ్వరీ కూతురు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.?
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
తెలుగులో దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి. ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆతర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మహేశ్వరీ అలనాటి అందాల తర్వాత శ్రీదేవికి చెల్లెలు అని చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
శ్రీదేవి, మహేశ్వరి కజిన్ సిస్టర్స్.. అక్క శ్రీదేవి పాన్ ఇండియా హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి రాణించగా ఆమె చెల్లి మహేశ్వరి తెలుగులో సినిమాలు చేసి మెప్పించింది. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న లేటెస్ట్ బ్యూటీ జాన్వీ కపూర్ మహేశ్వరికి కూతురు వరస అవుతుంది. మహేశ్వరి, జాన్వీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. జాన్వీ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది జాన్వీ..
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
జాన్వీ కపూర్ ఇన్ స్టా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.