ఆమెకు ఇంకా ఏడు సంవత్సరాలు కూడా నిండా లేవు.. ప్రపంచాన్ని ఏ మాత్రం చూడని అమాయక జీవి. కానీ, ఆమె ఇప్పటికే చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక పోయిందట. తండ్రి కొట్టిన దెబ్బలకు ఆమె శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. నెత్తురోడుతున్న శరీరంతో రైలు పట్టాలపై వెళ్తున్న ఆమెను ఒకరు గమనించి కాపాడటానికి పరిగెత్తారు. చివరకు ప్రాణాలతో రక్షించారు. ఏం జరిగిందని ఆరా తీయగా..ఆ చిన్నారి రోష్ని రైలు ముందు దూకి చనిపోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు . ఆమె తండ్రి ఆమెను ప్రతిరోజూ హింసించేవాడు, చిన్నారికి స్కూల్‌కి కూడా పంపటం లేదు. ఇంటి పని చేయమని బలవంతం చేసేవాడు. నేలపై పడవేసి ఈడ్చుకుంటూ కొట్టేవాడని ఏడుస్తూ చెప్పుకుంది.
అందుకే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నానని ఆమె చెప్పింది. రోష్ని తండ్రి సంతోష్ రాజ్‌పుత్‌కు ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్నారు. అతని భార్య మళ్ళీ గర్భవతి. అతని ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోవడంతో, అతనికి పిల్లల పాలన భారంగా మారిందని పోలీసులు గుర్తించారు. ఇదంతా విన్న ఒక రైతు రోష్ణిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతనికి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. అమ్మాయి కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు, అతను ఆ అమ్మాయిని స్కూల్లో చేర్పించాడు. ఆమెకు కొత్త బట్టలు కూడా కొనిపించాడు. కానీ, ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ లేకుండా నేరుగా దత్తత తీసుకోవడం చెల్లదని పోలీసులు తెలిపారు. అందువల్ల, ఆ అమ్మాయిని తిరిగి తన తండ్రికి అప్పగించారు.
ఈ సంఘటన పిల్లల రక్షణ సమస్యకు సంబంధించి సమాజంలో మరోసారి అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. 7 సంవత్సరాల వయస్సులో తన జీవితాన్ని ముగించుకోవాలనుకునే పిల్లల మానసిక ఒత్తిడి, భారం అందరినీ లోతుగా ఆలోచించేలా చేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..