ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్నది ప్రణీత. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే, మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. సిద్ధు సరసన బావ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. చూడగానే ఆకట్టుకునే అమాయకు చూపుతో అభిమానులను తన మాయలో పడేసింది ఈ ముద్దుగుమ్మ
ఇక ఈ మూవీ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించింది.
ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరికి ఒక పాప, బాబు జన్మించాడు.దీంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ కేన్సీ ఫెస్టివల్ కోసం బార్బీ డాల్‌లా తయారై తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. తన అంద చందాలతో యూత్‌ను ఆగం చేస్తుంది. లైట్ పింగ్ డ్రెస్‌లో గ్లామర్‌తో మతి పొగొడుతుంది.
ప్రస్తుతందీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.