ఏంట్రా ఇది.. 18 నిమిషాల్లో 14 కోట్లు సర్దేశారు.. అసలు ఏం జరిగిందంటే..?

ఏంట్రా ఇది.. 18 నిమిషాల్లో 14 కోట్లు సర్దేశారు.. అసలు ఏం జరిగిందంటే..?


ఈజీ మనీకోసం కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకులు, బంగారం షాపులే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటూ పోలీసులకు సవాల్ విసరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ చిన్న ఫైనాన్స్ బ్యాంకులో దోపిడికి పాల్పడి.. రూ.14 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ.5లక్షల నగదు దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 18 నిమిషాల్లోనే జరగడం గమనార్హం. జబల్‌పూర్ జిల్లాలో సోమవారం ఐదుగురు దొంగలు ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై దాడి చేసి.. రూ.14 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును దోచుకెళ్లారు. ఖిటోలా శాఖలో బ్యాంక్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. హెల్మెట్లు ధరించిన ఐదుగురు దొంగలు రెండు బైక్‌లపై వచ్చి ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లోకి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.

దోపిడీ సమయంలో బ్యాంకులో ఆరుగురు సిబ్బంది ఉన్నప్పటికీ, సెక్యూరిటీ గార్డు లేకపోవడం గమనార్హం. దొంగలు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల తర్వాత బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారని. ఆలస్యం కారణంగా దొంగలను పట్టుకోవడం కష్టమైందని డీఐజీ తెలిపారు. పండుగ సీజన్ కారణంగా బ్యాంక్ సాధారణ సమయం కంటే ముందుగా తెరుచుకోవడంతో ఈ దోపిడీ జరిగింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లోనూ..

మరోవైపు హైదరాబాద్‌లోనూ పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చందానగర్‌లో భారీ దోపిడికి యత్నించారు. ఐదుగురు దుండగులు ఖజానా జ్యువెలరీ షాప్‌లో చొరబడి గన్‌తో కాల్పులు జరిపారు. చంపేస్తామని బెదిరించి లాకర్ కీ తీసుకున్నారు. ఇంతలో పోలీసులు రావడంతో డిప్యూటీ మేనేజర్ కాళ్లపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దోపిడికి పాల్పడ్డ దుండగులు జహీరాబాద్ వైపు పారిపోగా.. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. దొంగలను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ 10టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *