ఏంటీ..! ఈవిడ ఆర్య సినిమా హీరోయినా..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఏంటీ..! ఈవిడ ఆర్య సినిమా హీరోయినా..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే


సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా ఆ మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాదు అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి మారుమ్రోగుతూనే ఉన్నాయి. అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు దేవీ శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.. మొదటి లుక్ లోనే మనసు దోచేసిన ఈ భామ పేరు అను మెహతా. చూడముచ్చటైన రూపం.. చక్కటి అభినయం కనబరిచిన ఏ చిన్నది ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే అను చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసింది. అయితే ఈ భామ కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..

అను మెహతా అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది. ఏం చేస్తుంది..? ఎలా ఉంది అని ప్రేక్షకులను అభిమానులు ఆలోచిస్తున్నారు. అను తెలుగులో ఆర్య, నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ అనే సినిమాలు చేసింది. అయితే వీటిలో ఆర్య సినిమా తప్ప మరో సినిమా వచ్చినట్టు కూడా ఎవ్వరికి తెలియదు. చివరిగా 2008లో కన్నడలో హొంగనసు అనే సినిమా చేసింది.

ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆర్య సినిమాలో గీత పాత్రలో కనిపించిన ఆ చిన్నదేనా ఈ ఫొటోల్లో ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమధ్య  ఈ అమ్మడు సాగరతీరాంలో అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె ఫోటోలు ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అను మెహతా ఇలా మారిపోయిందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

Arya Actress

https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *