వన్డే క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డు స్కోర్ నమోదు చేసింది ఇంగ్లాండ్. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారధ్య సమయంలో ఇంగ్లీష్ జట్టులో అందరూ అరవీర భయంకరులే. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును చుట్టి మడతెట్టేసింది. ఈ మ్యాచ్ జూన్ 19, 2018న జరగ్గా.. వన్-సైడెడ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ ఒకడు 100కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యంత దారుణమైన డిఫీట్ అవ్వడమే కాదు.. క్రికెట్ చరిత్రలోనే వరస్ట్ ఫెయిల్యూర్ అని అంటారు.
ఈ మ్యాచ్ జూన్ 19, 2018లో జరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 వన్డే సిరీస్‌లలోని మూడో వన్డే ఇది. ఇందులో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. దీంతో నిర్ణీత ఓవర్లకు ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(139), అలెక్స్ హేల్స్(147) చెలరేగి సెంచరీలు చేయగా.. మరో ఓపెనర్ జాసన్ రాయ్(82), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(67) ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక బెయిర్‌స్టో, హేల్స్ కలిసి 31 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టడమే కాదు.. రికార్డు పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.
ఆస్ట్రేలియా ఘోర ఓటమి..
భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా చతికిలబడింది. తొలి బంతి నుంచి దూకుడైన ఆటతీరును ప్రదర్శించినప్పటికీ.. వరుసగా వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లలో కేవలం 239 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్(51) ఒక్కడే అత్యధిక స్కోరర్. ఆపై మార్కస్ స్టోయినిస్ 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ లాంటి ప్లేయర్స్ కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లాండ్ 242 పరుగుల తేడాతో వన్డేలలోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.