
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేప్పట్టిన తర్వాత చాలా బిజీ అయ్యేరు. ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లోనూ వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహరవీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. వీరితో పాటు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో పవన్ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.
తాజాగా ఈ సినిమా సెట్‌లో మెగాస్టార్ మెరిశారు. ఉస్తాద్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. చిరంజీవి ఈ సినిమా సెట్స్‌కి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు మెగా ఫ్యామిలీ స్టార్స్ కలిసి కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ కూడా నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి