ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా వాటర్‌ అలవాటు చేసుకోండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా వాటర్‌ అలవాటు చేసుకోండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..


ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా వాటర్‌ అలవాటు చేసుకోండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయం పూట ఈ నీటిని తాగడం వల్ల అజీర్ణం, మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. చియా సీడ్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా ఆల్పా-లినోలెనిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది. చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడతాయి. ఆహారంలోని కార్పొహైడ్రేట్స్ షుగర్ గా మారడాన్ని నెమ్మది చేస్తుంది. గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తాయి. అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

చియా సీడ్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మా్న్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సాయపడతాయి. సహజంగానే మీ చర్మం మెరుపును పెంచుతాయి. చియా సీడ్స్ వాటర్ ను పీల్చి ఉబ్బుతాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీ ఆకలిని నియంత్రిస్తుంది. అధిక కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా DHA(డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్)కి గొప్ప మూలం. ఇవి మెదడు పనితీరుకు కీలకం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

చియా సీడ్స్ లోని ప్రోటీన్, ఫైబర్ స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతులుగా ఉంచేందుకు సహాయపడతాయి. మీరు వ్యాయామం చేసినప్పుడు చియా సీడ్స్ వాటర్ మీకు ప్రత్యేకంగా శక్తిని అందిస్తాయి. చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రించగలవు. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *