ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేయండి చాలు..! చర్మం, మెదడు పనితీరులో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా..?

ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేయండి చాలు..! చర్మం, మెదడు పనితీరులో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా..?


ఉదయం నిద్ర లేవగానే చాలా మంది చేసే మొదటి పని పళ్ళు తోమడం. కానీ ఈ అలవాటుకు ముందు ఒక గ్లాస్ నీరు తాగితే అది మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుందని మీకు తెలుసా..? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు ఈ సింపుల్ టిప్‌ ను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. పళ్ళు తోమకముందు నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పళ్లు తోమకముందు ఎందుకు నీళ్లు తాగాలి..?

రాత్రిపూట మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం సెల్ రిపేర్, డిటాక్సిఫికేషన్ లాంటి ముఖ్యమైన పనులు చేస్తుంది. ఈ ప్రక్రియలో వ్యర్థాలు, విషపదార్థాలు నోటిలో పేరుకుపోతాయి. మనం ఉదయం లేవగానే పళ్ళు తోమకుండా నీరు తాగితే ఆ విషపదార్థాలన్నీ కడిగివేయబడతాయి. అలాగే రాత్రంతా మన శరీరానికి నీరు అందక డీహైడ్రేషన్ ఉంటుంది. అందుకే వెంటనే నీరు తాగడం చాలా ముఖ్యం. పళ్ళు తోమకముందు నీరు తాగడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డిటాక్స్ మంత్రం

రాత్రిపూట పేరుకుపోయిన విషపదార్థాలను నీరు తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ సహజ డిటాక్స్ ప్రక్రియ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెటబాలిజం బూస్టర్

లేవగానే ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల మెటబాలిజం రేటు సుమారు 30 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెటబాలిజం పెరిగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

నోటి ఆరోగ్యం

పళ్ళు తోమకముందు నీరు తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా పలచబడి కడుపులోకి వెళ్ళిపోయి. మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. ఇది నోటిలో ఉన్న pH బ్యాలెన్స్‌ను కాపాడి.. నోటిలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది.

యాక్టివ్ గా జీర్ణవ్యవస్థ

ఉదయం నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమై మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.

చర్మ ఆరోగ్యం

రాత్రంతా డీహైడ్రేషన్ కారణంగా కోల్పోయిన తేమను నీరు తిరిగి అందిస్తుంది. ఇది చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. అలాగే ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

నీరు తాగే సరైన పద్ధతి

ఉదయం నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగండి. ఒక పదిహేను నిమిషాలు ఆగి పళ్లు తోముకున్నాక.. మీ రోజువారీ పనులను మామూలుగా మొదలుపెట్టవచ్చు.

ఉదయం పళ్ళు తోమకముందు నీరు తాగడం అనేది శక్తివంతమైన అలవాటు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ చిన్న మార్పుతో మీ రోజును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ప్రారంభించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *