ఈ స్వాతిముత్యాన్ని గుర్తుపట్టారా.? వరుసగా 5 హిట్లు.. అమ్మాయిల రాజకుమారుడు అతను..

ఈ స్వాతిముత్యాన్ని గుర్తుపట్టారా.? వరుసగా 5 హిట్లు.. అమ్మాయిల రాజకుమారుడు అతను..


సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచంగా మారిపోయింది.. ఎక్కడ ఎలాంటి విషయమైన క్షణాల్లో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నెట్టింట్లో గంటలు గంటలు గడిపేస్తున్నారు. తమ అభిమాన తారలకు దగ్గరయ్యేందుకు.. ఫేవరేట్ స్టార్స్ గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.. తమకు ఇష్టమైన వంటకాలు.. ప్రదేశాలు సినిమాలే కాకుండా.. తమ వ్యక్తిగత విషయాలు.. చిన్ననాటి ఫోటోస్.. రేర్ పిక్చర్స్ షేర్ చేస్తూ.. అభిమానులకు చేరువవుతున్నారు సినీ తారలు..ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ హీరోకి సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టరా.? వరుసగా నాలుగు హిట్స్ తో దూసుకుపోతున్నాడు ఆ హీరో..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఆయన అంటే పడి చచ్చిపోతారు. ఇంతకూ ఈ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన నాని ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. ఇటీవలే నిర్మాతగా కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ హిట్ గా నిలిచింది.

ఇక హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు నాని. దసరా సినిమాతో మొదలుపెట్టి వరుసగా హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. భారీ హిట్ దిశాగా దూసుకుపోతోంది హిట్ 3. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోనూ రానుంది. అలాగే ప్యారడైజ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈ సినిమాకు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *